Header Banner

ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణ మహోత్సవం.. టీటీడీ భారీ ఏర్పాట్లు! సీఎం చంద్రబాబు హాజరు!

  Thu Apr 10, 2025 19:28        Politics

రేపు ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులతో సమీక్షించారు. భక్తుల కోసం విశేష ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరవుతూ, రాష్ట్ర ప్రభుత్వ తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. వేడుకకు దాదాపు 60 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయగా, వారందరికీ కూర్చొనేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భక్తులకు కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
అంతేగాక, తిరుమల లడ్డూ ప్రసాదం పంపిణీ, అన్నప్రసాదాల విందు కూడా ఉండనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల విశ్రాంతి కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా రేపు ఉదయం నుంచే మజ్జిగ పంపిణీ, పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు, అక్కడి నుంచి కళ్యాణ వేదికకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కడప నుంచి ఒంటిమిట్టకు 40 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవం కోసం 2,500 మంది శ్రీవారి సేవకులు, మెడికల్ సిబ్బంది, ప్రత్యేక అంబులెన్స్‌లను కూడా మోహరించారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OntimittaKalyanam #LordRamaKalyanam #TTDUpdates #ChandrababuNaidu